TG Assembly: ఇప్పుడు నేనే ట్రెండింగ్ స్టార్.. అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డి హల్‌చల్

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-17 05:04:02  IST  )

అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి మల్లారెడ్డి మళ్లీ సందడి చేశారు. తానే ట్రెండింగ్ స్టార్ అంటూ.. అవసరమైతే త్వరలోనే సినిమా కూడా తీస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

TG Assembly: ఇప్పుడు నేనే ట్రెండింగ్ స్టార్.. అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డి హల్‌చల్
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) ఎక్కడ ఉంటే.. నవ్వులు విరబూయిస్తారు. తాజాగా ఇవాళ బడ్జెట్ సమావేశాల వేళ అసెంబ్లీ (Assembly) లాబీలో సందడి చేశారు. సోషల్ మీడియాలో తనకున్న క్రేజ్ గురించి, భవిష్యత్తు ప్రణాళికల గురించి మల్లారెడ్డి ఓపెన్‌గా మాట్లాడారు. తానే ఇప్పుడు ట్రెండింగ్ స్టార్.. అని, సోషల్ మీడియాను అసలు ప్రమోట్ చేస్తుందే తాను అంటూ కామెంట్ చేశారు. సినిమాల్లో నటించే అవకాశం గురించి స్పందిస్తూ.. ‘నాకు సినిమా అవకాశం ఒకరు ఇచ్చేది ఏంటి..? నేనే స్టార్’ అని అన్నారు. ఒకవేళ సినిమానే చేయాలనిపిస్తే, ఎవరి కోసమో వేచి చూడనని.. ‘అవసరం అయితే తానే సినిమా తీస్తా’ అంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటూ తనదైన పంచ్ డైలాగులతో వినోదాన్ని పంచే మల్లారెడ్డి, అసెంబ్లీ లాబీల్లో కూడా అదే జోష్ కొనసాగించడంతో అక్కడ నవ్వులు విరిశాయి.

Next Story