TG Assembly: కృష్ణా జలాలపై అప్పుడే చర్చ పెడదాం.. బీఆర్ఎస్‌కు సీఎం రేవంత్ సంచలన సవాల్

by Kema Shiva Kumar |   (  Updated:2025-03-15 07:57:01  IST  )

కేసీఆర్, హరీశ్‌రావు చంద్రబాబు ముందు మోకరిల్లారని.. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ మరణంశాసనం రాశారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

TG Assembly: కృష్ణా జలాలపై అప్పుడే చర్చ పెడదాం.. బీఆర్ఎస్‌కు సీఎం రేవంత్ సంచలన సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్, హరీశ్‌రావు చంద్రబాబు ముందు మోకరిల్లారని.. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ మరణంశాసనం రాశారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఇవాళ అసెంబ్లీలో గవర్నర్ (Governor) ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచారని తెలిపారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా నీటిని తీసుకుంటామన బీఆర్ఎస్ చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు. SLBC టన్నల్ ఉమ్మడి రాష్ట్రంలోనే 20 కి.మీ మేర పూర్తి చేశారని.. కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆ ప్రాజెక్ట్ వైపు కన్నెత్తి కూడా చూడలేదని అన్నారు.

నిండు సభలో కేసీఆర్‌కు క్షమాపణ చెబుతా..

కృష్ణా జలాల విషయంలో నేడు సభకు వస్తే సమాధానం చెప్పాల్సి వస్తుందనే కేసీఆర్ మొహం చాటేశారని కామెంట్ చేశారు. కేసీఆర్ ఏ రోజైతే సభకు వస్తారో.. ఆ రోజు తాను కృష్ణా జలాలపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. ఆ చర్చలో తమ తప్పు ఏమైనా ఉందని నిరూపిస్తే.. నిండు అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులకు తాను క్షమాపణ చెబుతానని అన్నారు. కృష్ణ నదీ జలాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి శాశ్వతంగా అన్యాయం జరిగిందని ఆరోపించారు. 2022లో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను ప్రగతి భవన్‌కు పిలిపించుకుని.. పచభక్ష పరమాన్నాలు పెట్టారని అన్నారు. రాయలసీమలో ఇవాళ పోతిరెడ్డిపాడు, మాల్యాల, ముచ్చుమర్రి, రాయలసీమ లిఫ్ట ఇరిగేష్ నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా రోజుకు 10 టీఎంసీ నీరు ఆంధ్రాకు అక్రమంగా వెళ్తోన్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 60 రోజుల్లో 600 టీఎంసీల కృష్ణా జలాలు పోతే.. మనకు ఏం మిగుతాయని అన్నారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ రూ.57.84 లక్షల జీతం తీసుకున్నారని.. ఇప్పటి వరకు ఆయన కేవలం రెండు సార్లే అసెంబ్లీకి వచ్చారని ఎద్దేవా చేశారు. ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. దక్షిణ తెలంగాణ రైతులకు కేసీఆర్ మరణశాసనం రాశారని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు.

TG Assembly: గత సర్కార్ ప్రజాస్వామ్య విలువలు మరిచింది.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Next Story