- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Assembly: స్టేచర్ మీద ఉన్న శ్రద్ధ బీఆర్ఎస్‌కు స్టేట్ ఫ్యూచర్‌పై లేదు.. సీఎం రేవంత్ సెన్సేషనల్ కామెంట్స్
కులానికి ఎక్కడా స్టేచర్ ఉండదని.. మీరుకు మీరుగా స్టేచర్‌ను ఆపాదించుకోవద్దని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కులానికి ఎక్కడా స్టేచర్ ఉండదని.. మీరుకు మీరుగా స్టేచర్‌ను ఆపాదించుకోవద్దని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీలో గవర్నర్ (Governor) ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. గవర్నర్‌ను గౌరవించడం లేదని.. స్పీకర్ స్పీకర్‌ను బీఆర్ఎస్ నేతలు గౌరవించడం లేదని కామెంట్ చేశారు. ఎందుకిలా బరితెగిస్తున్నారని మండిపడ్డారు. అజ్ఞానాన్నే విజ్ఞానం అనేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. కులానికి ఎక్కడా స్టేచర్ ఉండదని.. పదవికి మాత్రమే స్టేచర్ ఉంటుందని, వ్యక్తికి కూడా కాదని తెలిపారు. ఇక మీదట ఫామ్‌హౌజ్‌లలో డ్రగ్స్ పార్టీలను ఉపేక్షించబోమని అన్నారు.
దుబాయ్‌లో ఏం జరిగిందో వివరాలు తెప్పించాం..
దుబాయ్‌లో ఏం జరిగిందో అన్ని వివరాలు తెప్పించామంటూ నిర్మాత కేదార్ మృతికి సంబంధించి ఆయన సభలో ప్రస్తావించారు. ఆ నాయకుడు సభకు వచ్చాక అన్నీ బయటపెడతామని అన్నారు. బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లతోనే తాము ఉద్యోగాలు ఇచ్చామని అంటున్నారని, ప్రక్రియ మొత్తం పూర్తి చేసి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. మొదటి ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర తమ సర్కారుకే దక్కిందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గిందని ఇటీవల వచ్చిన నివేదికలు చెబుతున్నాయని కామెంట్ చేశారు. రాష్ట్రంలో విద్యా వవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్నామని, 100 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. కేవలం తమ ప్రభుత్వం నిరుపేదల పిల్లల చదువుల కోసమే ఇవన్నీ చేస్తోందని అన్నారు. రూ.300 కోట్ల వ్యయంతో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాన్ని నిర్మించబోతున్నామని తెలిపారు.
మార్చురీలో బీఆర్ఎస్ పార్టీ..
స్టేచర్ మీద ఉన్న ఆలోచన బీఆర్ఎస్‌కు స్టేట్ ఫ్యూచర్‌పై లేదని కామెంట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మార్చురీలో ఉందని అన్న మాట వాస్తవమేనని.. అందులో తప్పేముందని సమర్ధించుకన్నారు. తాను కేసీఆర్‌ను కించపరిచినట్లుగా కేటీఆర్, హరీశ్ రావు విమర్శిస్తున్నారని.. కేసీఆర్ వందేళ్లు జీవించి ప్రతిపక్షంలోనే ఉండాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. గత 15 నెలల కాలంలో తాను 32 సార్లు ఢిల్లీకి వెళ్లానని.. అవసరం అయితే 300 సార్లు వెళ్తానని ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సత్సంబంధాలు కొనసాగించాలని.. దేశ ప్రధాని ఏ రాష్ట్రానికికైనా పెద్దన్న లాంటివారేనని అన్నారు. అందులో రాజకీయం ఏముంటుందని.. బీఆర్ఎస్ నాయకుల్లా తాను చీకట్లో ఎవరి కాళ్లు పట్టుకోలేదని తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డుతో సహా అన్ని ప్రాజెక్టులకు అనుమతులు తీసుకొచ్చానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Read More..
TG Assembly: గత సర్కార్ ప్రజాస్వామ్య విలువలు మరిచింది.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు






