- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: బీసీ రిజర్వేషన్లపై పొలిటికల్ హీట్.. సీఎం వెంటే ఢిల్లీకి పీసీసీ చీఫ్, మినిస్టర్స్
తెలంగాణ రాజకీయం బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయం బీసీ రిజర్వేషన్ల (BC Reservations) సెంట్రిక్ గా హీటెక్కుతున్నాయి. బీసీ బిల్లుపై ఇప్పటికే అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్న వేళ అధికార పార్టీ ముఖ్యనేతలు ఢిల్లీబాట పట్టడం ఆసక్తిగా మారుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పిటికే ఢిల్లీ చేరుకోగా తాజాగా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్, బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ ఢిల్లీ బాట పట్టారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్, మంత్రులు, ఏఐసీసీ ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ రేపు ఉదయం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, లోక్ సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సమావేశం కాబోతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో జరిగిన కులగణన, 42 శాతం బీసీ రిజర్వేషన్లు తదితర అంశాలను పార్టీ పెద్దలతో కీలక చర్చ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
కేబినెట్ భేటీకి వారం ముందు:
ఎల్లుండి తెలంగాణ కేబినెట్ భేటీ జరగబోతున్నది. ఈ భేటీలో స్తానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై కీలక చర్చ జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీకి ముందు సీఎంతో పాటు పీసీసీ చీఫ్, బీసీ మంత్రులు హస్తిన పర్యటన ఉత్కంఠ రేపుతోంది. పార్టీ అధిష్టానంతో ఏం చర్చించబోతున్నారు? బీసీ రిజర్వేషన్ల విషయంలో గవర్నర్, కేంద్రం సహకరించకపోతే ఏం ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు అనేది సస్పెన్స్ గా మారింది. బీసీ బిల్లు విషయంలో ఇప్పటికే దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ సమావేశాల వేళ కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో బీసీ బిల్లు చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయం ఇప్పుడు ఢిల్లీ వెదికగా ఎలాంటి పరిణామాలకు దారి తీయబోతున్నది అనేది ఆసక్తిగా మారింది.






