నోరుజారిన కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్ (వీడియో)

by GSrikanth |
నోరుజారిన కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్ (వీడియో)
X

దిశ, సిరిసిల్ల ప్రతినిధి: తెలంగాణ పవర్ లూమ్స్, టెక్స్‌టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కార్పొరేషన్ చైర్మన్ అయ్యాక రోజూ ఏదో వివాదం గూడూరి చుట్టూ ముడుతూనే ఉంది. తాజాగా శుక్రవారం సెస్ ఎన్నికలపై పెట్టిన ప్రెస్‌మీట్ వివాదాస్పదంగా మారింది. ఈ ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. పోలింగ్ అనంతరం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో గూడూరి ప్రవీణ్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ గెలస్తుందని మాట్లాడాల్సింది పోయి.. సెస్ పరిధిలోని 15 స్థానాలకు 15 స్థానాలు బీజేపీ గెలవబోతున్నట్లు తమకు సమాచారం ఉందని నోరు జారాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన మైనార్టీ సెల్ నేత సత్తార్ వెనుకనుంచి భుజం మీద చేయి వేసి తప్పు చెప్పావని చెప్పడంతో.. మళ్లీ మాట మార్చి బీఆర్ఎస్ గెలవబోతుందని అన్నారు. దీంతో బీజేపీ సోషల్ మీడియా.. గూడూరి ప్రవీణ్ వీడియోను వైరల్ చేసింది. 'ప్రవీణ్ అన్న బీజేపీపై నీకు ఉన్న నమ్మకానికి ధన్యవాదాలు. తమకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు.' అని ట్రోల్ చేస్తున్నారు.

Next Story

Most Viewed