- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో మరింత ఆలస్యంగా టెక్ట్స్ బుక్స్
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరానికి(2026-27) టెక్ట్స్ బుక్స్ పంపిణీ పై విద్యాశాఖ వర్గాల్లో చర్చ మొదలైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరానికి(2026-27) టెక్ట్స్ బుక్స్ పంపిణీ పై విద్యాశాఖ వర్గాల్లో చర్చ మొదలైంది. సాధారణంగా విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే బుక్స్ సిద్ధం చేయాల్సి ఉండగా, వాటి ముద్రణ ప్రక్రియ ఇంకా ప్రారంభించలేదు. పాఠ్యపుస్తకాల ప్రింటింగ్ టెండర్ల ప్రక్రియ డిసెంబర్ నెలాఖరులో మొదలయ్యే అవకాశం ఉందని అధికారిక సమాచారం గా తెలుస్తున్నది. ప్రతిఏటా సాధారణంగా డిసెంబర్ లేదా జనవరి నుంచి టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని పాఠశాల విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. మూడు నెలల్లో ప్రింటింగ్ ప్రారంభమై మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ నెలాఖరు నాటికి జిల్లా కార్యాలయాలకు చేరాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఎమ్మార్సీల ద్వారా ఆయా స్కూళ్లకు పంపిణీ చేస్తుంటారు.
అందుకోసం కనీసం నాలుగు నెలలైనా సమయం కావాలి. ఆ ప్రక్రియ ప్రారంభమై స్కూళ్లకు చేరే సరికి జూన్ లో పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం పున:ప్రారంభమవుతాయి. సిలబస్ లో మార్పులేమీ ఉండబోవని విద్యాశాఖ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ ప్రింటింగ్ ప్రక్రియ టెండర్లను పిలవడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారో తెలియడం లేదు. టెండర్లు పిలవడానికే ఇంత జాప్యం జరిగితే, స్కూళ్లు తెరిచేలోగా బుక్స్ విద్యార్థులకు చేరే అవకాశం లేదని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. బుక్స్ ఆలస్యంగా ఇవ్వడం ద్వారా సరైన సమయంలో సిలబస్ పూర్తి కాక విద్యార్థులు పరీక్ష ఫలితాల్లో వెనకబడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెండేళ్లుగా అదే తీరు
పాఠశాల విద్యాశాఖలో బుక్స్ పంపిణీ జాప్యం అనేది కొత్త విషయమేమీ కాదు. రెండేళ్లుగా పాఠ్యపుస్తకాల పంపిణీ ఆలస్యమవుతున్న తీరు విద్యార్థులు, ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేస్తున్నది. రెండేళ్ల నుంచి ముఖ్యంగా కొన్ని తరగతుల్లో మూడు సబ్జెక్టులను రెండు విభాగాలుగా(పార్ట్-1, పార్ట్-2) విభజించి పాఠశాల విద్యాశాఖ పంపిణీ చేస్తున్నది. పుస్తకాల్లో ఓ వైపు తెలుగు, మరోవైపు ఇంగ్లిష్ ఉండటంతో పుస్తకాల పరిమాణం పెరిగిపోవడంతో వాటిని రెండు పార్ట్స్ గా డివైడ్ చేశారు. అందులో పార్ట్-1 బుక్స్ జూన్ లో అందించారు. పార్ట్-2 పుస్తకాలు అక్టోబర్ ఎస్ఏ 1 పరీక్షల నాటికి అందించాల్సి ఉంటుంది. కానీ నవంబర్ వచ్చినా రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లకు ఇంకా పాఠ్యపుస్తకాలు అందకపోవడం శోచనీయం.






