వారంలో టెట్ నోటిఫికేషన్!

by Muthe.Rajitha |

తెలంగాణలో టెట్ నిర్వహణ కోసం విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసారు.

వారంలో టెట్ నోటిఫికేషన్!
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో టెట్ నిర్వహణ కోసం విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసారు. ఇందుకు సంబంధించిన ఫైల్ సీఎంకు చేరినట్టు సమాచారం. ఏటా రెండు సార్లు టెట్​ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించగా.. ఈ ఏడాది రెండో విడత నోటిఫికేషన్ కోసం అధికారులు ఫైల్​ సిద్ధం చేశారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే వారంలో నోటిఫికేషన్​ వచ్చే అవకాశముంది అధికారులు చెబుతున్నారు.

అయితే టీచర్లూ టెట్​ పాసవడం తప్పనిసరని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వారికి అవకాశం కల్పించేందుకు అర్హత నిబంధనల జీవోను సవరించామని అన్నారు. ఈ క్రమంలో ఈసారి టెట్ కు భారీగా అభ్యర్థులు హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.

Next Story