- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG TET : తెలంగాణలో రేపటి నుంచి టెట్ పరీక్షలు
తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TG TET) 2025 జూన్ సెషన్ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TG TET) 2025 జూన్ సెషన్ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 13 రోజులపాటు అనగా జూన్ 18 నుంచి జూన్ 30 వరకు ఇవి నిర్వహించబడనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు వెల్లడించారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పద్ధతిలో జరగనున్న ఈ పరీక్షలు మొత్తం 9 రోజులలో 16 సెషన్లలో నిర్వహిస్తారు. ఇందుకోసం 15 జిల్లాల్లోని 66 పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పరీక్షలు రోజుకు రెండు షిఫ్ట్‌లలో (ఉదయం 9:00 నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2:00 నుంచి 4:30 వరకు) నిర్వహించబడతాయి.
టెట్ పేపర్-1 (1 నుంచి 5వ తరగతుల ఉపాధ్యాయులకు), పేపర్-2 (6 నుంచి 8వ తరగతుల ఉపాధ్యాయులకు) కోసం నిర్వహించబడుతుంది. వీటికి సంబంధించిన హాల్ టికెట్లు జూన్ 11 నుంచి అధికారిక వెబ్‌సైట్ tgtet.aptonline.in లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ జర్నల్ నంబర్, పుట్టిన తేదీతో హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు హాల్ టికెట్, చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీ తప్పనిసరిగాన్ పరీక్ష హాలుకు తీసుకెళ్లాలి. వీటి ఫలితాలు జూలై మూడవ వారంలో ప్రకటించే అవకాశం ఉంది.






