టీచర్ అవ్వాలనుకునే వారికి బిగ్ అలర్ట్.. టెట్ ఎగ్జామ్ అప్‌డేట్

by Gantepaka Srikanth |

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీజీ టెట్) జూన్-2026 దరఖాస్తుల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది.

టీచర్ అవ్వాలనుకునే వారికి బిగ్ అలర్ట్.. టెట్ ఎగ్జామ్ అప్‌డేట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీజీ టెట్) జూన్-2026 దరఖాస్తుల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి నేటి నుండి మే 3 వరకు ఎడిట్ ఆప్షన్ వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. మంగళవారం సాయంత్రం వరకు మొత్తం 96,189 ధరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. పేపర్ 1 కు 22,513, పేపర్ 2 కు 60,940 ఉండగా రెండు పేపర్లు కలిపి దరఖాస్తు చేసుకున్న వారు 12,736 మంది ఉన్నట్లు టీజీటెట్ కన్వీనర్ జి.రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://schooledu.telangana.gov.in ద్వారా తమ వివరాలను సరిచూసుకోవచ్చు. ధరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 30 వరకు అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు ఈ రెండు రోజుల్లో ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు.

Next Story