TET-2026: రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్షలు ప్రారంభం.. సర్వం సిద్ధం చేసిన అధికారులు

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-03 03:32:46  IST  )

రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET-2026)లు ప్రారంభమయ్యాయి.

TET-2026: రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్షలు ప్రారంభం.. సర్వం సిద్ధం చేసిన అధికారులు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET-2026)లు ప్రారంభమయ్యాయి. ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్న ఈ పరీక్షలు ఈ నెల 20 వరకు జరగనున్నాయి. అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్‌కు నిర్దేశించిన సమయం కంటే గంటన్నర ముందే చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్షా కేంద్రం గేట్లను మూసిన తర్వాత అభ్యర్థులను లోపలికి అనుమతించరని స్పష్టం చేశారు. అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ప్రభుత్వం జారీ చేసిన ఒరిజినల్ ఐడీ కార్డు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ (Electronic Gadgets)ను ఎగ్జామ్ సెంటర్‌లోకి అనుమతించరని తెలిపారు. హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అభ్యర్థులు అందులోని వివరాలను సరిచూసుకోవాలి. హాల్ టికెట్‌పై ఫొటో, సిగ్నేచర్ సరిగ్గా లేకపోతే అభ్యర్థులు ఫొటో అతికించి గెజిటెడ్ ఆఫీసర్‌తో సంతకం చేయించుకుని రావాలని స్పష్టం చేశారు. ఇక పరీక్షా సమయం పూర్తయిన తర్వాతే అభ్యర్థులను పరీక్షా కేంద్రం నుంచి బయటికి పంపుతామని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు.

కాగా, టెట్ (TET) పరీక్షలకు గాను పేపర్-1, పేపర్-2 కలిపి మొత్తం 2,37,754 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 71,670 మంది ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారు. దేశవ్యాప్తంగా టెట్‌ను తప్పనిసరి చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులు కూడా పరీక్ష రాయడానికి దరఖాస్తు చేసుకున్నారు. టెట్ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ 97 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది.

Next Story