- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pahalgam Terror Attack : ఉగ్రదాడి ఘటన.. తృటిలో తప్పించుకున్న హైదరాబాద్ మ్యూజిక్ బ్యాండ్
పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నుంచి హైదరాబాద్ కు చెందిన ఓ మ్యూజిక్ బ్యాండ్ సభ్యులు(Hyderabad Music Band) తృటిలో తప్పించకున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నుంచి హైదరాబాద్ కు చెందిన ఓ మ్యూజిక్ బ్యాండ్ సభ్యులు(Hyderabad Music Band) తృటిలో తప్పించకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉగ్రదాడి అనంతరం శ్రీనగర్ లో చిక్కుకున్న తెలంగాణ పర్యాటకులు శనివారం తెల్లవారు జామున రాష్ట్రానికి చేరుకున్నారు. అనేకమంది తాము ఆ దాడి నుంచి తృటిలో తప్పించకున్నట్టు మీడియాకు తెలిపారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన ఓ మ్యూజిక్ బ్యాండ్ సభ్యులు కూడా ఉన్నారు. ఈ బృందంలో సి. సింథియా, కె. మనీషా, రూత్ కరుణామయి, నీతి రాజ్ ఇతర సభ్యులు ఉన్నారు. ఒక మ్యూజిక్ వీడియో షూటింగ్ కోసం ఆ రోజు ఉదయం శ్రీనగర్‌కు విమానంలో చేరుకున్నారు. అయితే, బృందంలోని కొంతమంది సభ్యులు గుర్రాలపై బైసరన్ మేడోస్‌కు వెళ్లడానికి నిరాకరించడంతో, వారు మేడోస్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయారు.
ఈ నిర్ణయమే వారి ప్రాణాలను కాపాడింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక వినతితో జమ్మూ కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి మనోజ్ సిన్హా ఈ బృందాన్ని వారు ఉంటున్న హోటల్‌లో కలిసి, వారి భద్రతకు హామీ ఇచ్చారు. వీరంతా శనివారం తెల్లవారుజామున తెలంగాణకు సురక్షితంగా చేరుకున్నారు. ఈ సందర్భంగా వారంతా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), సీఎస్ శాంతి కుమారి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఐపీఎస్ అధికారి నలిన్ ప్రభాత్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.






