Terrible: రాష్ట్రంలో మరో అమానుషం.. 17 ఏళ్ల మైనర్‌పై గ్యాంగ్ రేప్

by Kema Shiva Kumar |

ఆడది ఒంటిరిగా కనిపిస్తే చాలు.. కామాంధులు కన్ను మిన్ను కానకుండా వ్యవహరిస్తున్నారు.

Terrible: రాష్ట్రంలో మరో అమానుషం.. 17 ఏళ్ల మైనర్‌పై గ్యాంగ్ రేప్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆడది ఒంటిరిగా కనిపిస్తే చాలు.. కామాంధులు కన్ను మిన్ను కానకుండా వ్యవహరిస్తున్నారు. అప్పుడే పుట్టిన ముక్కుపచ్చలారని పసిపాప నుంచి పండు ముసలి అని చూడకుండా వారిపై వరుసగా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మహిళల భద్రతకు ఎన్ని చట్టాలు చేసినా.. అవి బుట్టదాఖలే అవుతున్నాయి. కొంతమంది నేరస్థులకు కఠిన శిక్షలు పడినా.. అత్యాచారాలు, లైంగిక వేధింపులకు ఎండ్ కార్డ్ మాత్రం పడటం లేదు. ఈ క్రమంలోనే 17 ఏళ్ల మైనర్ బాలికపై ఏకంగా పది మంది అత్యంత పైశాచికంగా అత్యాచారానికి పాల్పడిన హృదయ విదారక ఘటన ఘటన జార్ఖండ్‌ (Jharkhand) రాష్ట్రంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. గొడ్డా (Godda) జిల్లా సుందర్ పహారి (Sunder Pahari) పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు 17 ఏళ్ల మైనర్ బాలిక బంధువుల ఇంటి వెళ్లింది. అయితే, శుక్రవారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లగా.. పదిమంది కలిసి ఆ బాలికను ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అనంతరం ఒకరి తరువాత మరొకరు అత్యాచారానికి పాల్పడి అక్కడి నుంచి పరారయ్యారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అనంతరం నిందితులలో మొత్తం 8 మందిని ఇప్పటి వరకు అదుపులోకి తీసున్నారు. మరో ఇద్దరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Next Story