భూ భారతి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా టెర్రాసిస్ ఫీల్డ్ స్టాఫ్..

by Kema Shiva Kumar |

టెర్రాసిస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఫీల్డ్ స్టాఫ్‌ను భూభారతి కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

భూ భారతి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా టెర్రాసిస్ ఫీల్డ్ స్టాఫ్..
X

దిశ, తెలంగాణ బ్యూరో: టెర్రాసిస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఫీల్డ్ స్టాఫ్‌ను భూభారతి కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారిని టీజీటీఎస్ కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తిస్తూ, అదేవిధంగా వేతలను పెంచుతూ తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. టెరాసిస్ అనే ప్రైవేట్ సంస్థ తరఫున ధరణి ఆపరేటర్లుగా ఉన్న వారిని తెలంగాణ భూభారతి ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్‌గా టీజీటీఎస్ కాంట్రాక్టు ఉద్యోగులుగా సముచిత గౌరవాన్ని కల్పించారు. రూ.12 వేలు ఉన్న నెల జీతాన్ని రూ.28,148లకు పెంచుతూ ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్‌‌కు విజయదశమి కనుక అయ్యింది. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇంతటి నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫీల్డ్ స్టాఫ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తమ చిరకాల కోరిక నెరవేర్చిన ప్రభుత్వానికి, సీసీఎల్ఏ లోకేష్ కుమార్, సీఎమ్మార్వో పీడీ మకరందం, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చి‌రెడ్డిలకు తెలంగాణ భూ భారతి ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ (FTS) అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది.

Next Story