యాదగిరిగుట్టలో టెన్షన్ వాతావరణం.. బాహాబాహీకి దిగిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-23 04:23:35  IST  )

ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో యాదరిగిగుట్ట (Yadagirigutta)లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

యాదగిరిగుట్టలో టెన్షన్ వాతావరణం.. బాహాబాహీకి దిగిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో యాదరిగిగుట్ట (Yadagirigutta)లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు ఆత్మీయ సన్మాన సభను నిర్వహించేందకు ఇవాళ కాంగ్రెస్ నేతలు అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ హాజరుకానున్నారు. అయితే, సన్మాన సభ సందర్భంగా ఆలయ వైకుంఠ ద్వారం వద్ద కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడే అసలు పంచాయతీ మొదలైంది.

ఆలయ ఆవరణలో రాజకీయ ఫ్లెక్సీలు పెట్టడానికి నిషేధం ఉన్నప్పటికీ ఇలా అడ్డగొలుగా ఫ్లెక్సీలు పెట్టడం ఏంటని బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం ఆగ్రహంతో రగిలిపోయిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు కలసి కాంగ్రెస్ ఫ్లెక్సీలను చించేశారు. ఈ ఘటనతో ఇరు పక్షాల నేతలు, కార్యకర్తల బాహాబాహీకి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అప్రమత్తమైన పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్‌‌కు తరలించారు. ఆలయ పవిత్రతను కాపాడాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ రాజకీయ కార్యక్రమాలను ఆలయ ప్రాంగణంలో నిర్వహించడం పట్ల బీఆర్ఎస్ నేతలు, ఆలయానికి వచ్చిన భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఇరు పార్టీల నేతల నుంచి ప్రకటన వెలుడలేదు. ప్రస్తుతం స్పాట్‌లో పోలీసులు పరిస్థితిని నియంత్రణలోకి తీసుకొచ్చారు.

Next Story