Breaking: నందినగర్‌ కేసీఆర్‌ ఇంటి వద్ద ఉద్రిక్తత

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-01 11:26:02  IST  )

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది...

Breaking: నందినగర్‌ కేసీఆర్‌ ఇంటి వద్ద ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌(Telangana Former Cm Kcr)ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ నందినగర్‌(Nadinagar)లోని నివాసం రెండో అంతస్తులో కేసీఆర్‌ను ఆరుగురు అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ పరిణామాన్ని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేసీఆర్ నివాసం వద్దకు భారీగా చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లేందుకు యత్నిస్తున్నారు. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం నుంచి బసవతారకం కాన్సర్‌ ఆస్పత్రి రోడ్డు నుంచి కేసీఆర్‌ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్‌ శ్రేణులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ మేరకు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనలో కేసీఆర్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

MORE NEWS : BRS : కేసీఆర్ సిట్ విచారణ.. సెక్రటేరియట్ ముందు ఉద్రిక్తత

Next Story