BRS : కేసీఆర్ సిట్ విచారణ.. సెక్రటేరియట్ ముందు ఉద్రిక్తత

by Ramesh Naini |   (  Updated:2026-02-01 11:27:04  IST  )

తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ విచారణ ఇవాళ ప్రారంభమైంది.

BRS : కేసీఆర్ సిట్ విచారణ.. సెక్రటేరియట్ ముందు ఉద్రిక్తత
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ విచారణ ఇవాళ ప్రారంభమైంది. ఈ సిట్ విచారణను బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఫోన్ టాపింగ్ నెపంతో కేసీఆర్‌ ( KCR ) ను విచారణకు పిలవడం కక్ష సాధింపు చర్య మండిపడుతూ తెలంగాణ వ్యాప్తంగా కార్యకర్తలు నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బొమ్మకు అంటుకున్న మంటలను ఆర్పారు. పలువురు బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో సచివాలయం పరిసరాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

MORE NEWS : Breaking: నందినగర్‌ కేసీఆర్‌ ఇంటి వద్ద ఉద్రిక్తత

Next Story