- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్: TPCC చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత
కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ నేతల అసంతృప్త సెగలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఇంటికి తగిలాయి. పటాన్ చెరు కాంగ్రెస్ టికెట్ ఇటీవల పార్టీలో చేరిన నీలం మధు ముదిరాజ్‌కు

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ నేతల అసంతృప్త సెగలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఇంటికి తగిలాయి. పటాన్ చెరు కాంగ్రెస్ టికెట్ ఇటీవల పార్టీలో చేరిన నీలం మధు ముదిరాజ్‌కు ఇవ్వడంతో పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నేత కాట శ్రీనివాస్ గౌడ్ అనుచరులు భగ్గుమన్నారు. ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్‌లోని రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి కాట శ్రీనివాస్ గౌడ్ అనుచరులు యత్నించారు. టికెట్ కాట శ్రీనివాస్ గౌడ్‌కు ఇవ్వాలని పెద్ద ఆందోళనకు దిగారు. డబ్బులకు పటాన్ చెరు కాంగ్రెస్ టికెట్ అమ్ముకున్నారంటూ పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాట శ్రీనివాస్ గౌడ్ అభిమానులు, అనుచరులు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ఇంటివద్దకు చేరుకుని ఆందోళనకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు శ్రీనివాస్ గౌడ్ అనుచరులను అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి ఇంటివద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. టికెట్ దక్కని ఆశవహుల ఆందోళనలను నిన్నటి వరకు గాందీభవన్ వరకే పరిమితం కాగా.. ఇవాళ ఏకంగా పార్టీ స్టేట్ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్దకే చేరుకోవడం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.






