Film Chamber: ఆంధ్రా గో బ్యాక్.. తెలుగు ఫిలిం ఛాంబర్‌ వద్ద టెన్షన్

by Prasad Jukanti |

తెలుగు ఫిలిం ఛాంబర్ వద్ద తెలంగాణ వాదులు ఆందోళనకు దిగారు.

Film Chamber: ఆంధ్రా గో బ్యాక్.. తెలుగు ఫిలిం ఛాంబర్‌ వద్ద టెన్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ లోని తెలుగు ఫిలిం ఛాంబర్ వద్ద (Telugu Film Chamber) తెలంగాణ వాదులు ఆందోళనకు దిగారు. తెలంగాణ నటుల విషయంలో వివక్ష చూపుతున్నారని సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదరిగితో సహా తెలంగాణ వాదులు నిర్మాతల మండలి లోపలికి చొచ్చుకుని పోయేందుకు ప్రయత్నించారు.. ఫిలిం ఛాంబర్ సెక్రటరీ ప్రసన్న కుమార్ తో పాశం యాదగిరి (Pasham Yadagiri) వాగ్వాదానికి దిగారు. చాంబర్ లో పైడి జయరాజ్ ఫొటో చిన్నదిగా పెట్టారని, సినారే ఫొటో ఎందుకు లేదని తెలంగాణ వాదులు ప్రశ్నించారు. ఓ హీరోయిన్ ఫోటో కింద పైడి జయరాజ్ ఫోటో పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసుల జోక్యంతో వ్యవహారం సద్దుమణిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన పాశం యాదగిరి.. ఆంధ్రా గో బ్యాక్ (Andhra Go Back) అంటూ నినాదాలు ఇచ్చారు. తెలంగాణ వాళ్ల ఫోటోలు చిన్నవిగా ఉన్నాయని అడిగితే తమను లాగిపారేస్తున్నారని మండిపడ్డారు. తాము దాడి చేయలేదని దాడి చేస్తే చాంబర్ తగలబడిపోయిందా? పగిలిపోయిందా? అని ప్రశ్నించారు. తెలంగాణ వాళ్ల పట్ల వివక్ష చూపితే దాడి చేయడం కాదు మిమ్మల్ని ఇక్కడ బతకనివ్వమని హెచ్చరించారు. ఇండస్ట్రీలో కులతత్వం, ప్రాంతీయ తత్వం ఉందన్నారు. చంద్రబాబు ఏజెంట్లు తెలంగాణలో ఉండటానికి వీళ్లేదన్నారు.

Next Story