- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
High Court: తెలంగాణ హైకోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత.. బీసీ సంఘాల ఆందోళన.. బంద్‌కి పిలుపు
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 తో పాటు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌పై కూడా ఇవాళ హైకోర్టు స్టే విధించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations) కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 తో పాటు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌పై కూడా ఇవాళ (Telangana High Court) తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ క్రమంలోనే హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విచారణ నేపథ్యంలో బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున గుమిగూడారు.
స్థానిక ఎన్నికల నోటిఫికేషన్, రిజర్వేషన్ల అంశంపై స్టే విధించిన అనంతరం బీసీ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ కేసులో జరుగుతున్న పరిణామాలపై బీసీ సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్టేను తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. హైకోర్టులో తమకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు పదవులు వస్తుంటే ఓర్వలేక పోతున్నారని, ఈ నేథ్యంలోనే రేపు రాష్ట్ర బంద్‌కి పిలుపునిచ్చారు. హైకోర్టు గేట్ నెంబర్ 4 వద్ద బీసీ సంఘాల నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నం చేశారు. కానీ, వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకొచ్చారు.






