సొమ్మసిల్లి పడిపోయిన మహిళా నేత.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత

by Prasad Jukanti |

కేసీఆర్ ను విచారించడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు నిరనస వ్యక్తం చేస్తున్నాయి.

సొమ్మసిల్లి పడిపోయిన మహిళా నేత.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకోంది. పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. నందినగర్ లో కేసీఆర్ ను ప్రశ్నిస్తు్న్నారు. అయితే కేసీఆర్ ను ప్రశ్నించడాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ ఉదయం నుంచే బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ భవన్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ క్రమంలో కార్యకర్తలు నందినగర్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేయగా వారిని పోలీసులు చెదరగొట్టారు. ఈ క్రమంలో ఓ బీఆర్ఎస్ మహిళా కార్యకర్త సొమ్మసిల్లి పడిపోయారు.

Next Story