- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అర్ధరాత్రి ఉద్రిక్తత
రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. బొటానికల్ గార్డెన్‌లోని భారీ వృక్షాలను ప్రభుత్వం తొలగిస్తున్నట్టు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. బొటానికల్ గార్డెన్‌లోని భారీ వృక్షాలను ప్రభుత్వం తొలగిస్తున్నట్టు తెలుస్తోంది. 20 జేసీబీలతో చెట్లను తొలగిస్తున్నట్టు సమాచారం. విద్యార్థులు నిలదీయడంతో పోలీస్ బలగాలు అక్కడకు చేరుకుని విద్యార్థులను చెదరగొట్టినట్టు తెలుస్తోంది. హాస్టల్ వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి హాస్టల్ నుండి విద్యార్థులను బయటకు రాకుండా అడ్డుకున్నారట. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వన మహోత్సవం పేరుతో 20 ఎకరాలను చదును చేసేందుకు ఇలా చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే యూనివర్సిటీకి సంబంధించిన వంద ఎకరాల భూములను హైకోర్టు నిర్మాణానికి కేటాయించడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేడు యూనివర్సిటీలో వనమహోత్సం నిర్వహిస్తుండగా విద్యార్థులు అడ్డుకునేందుకు ప్రయత్నించబోతున్నారంటూ ప్రచారం జరుతుతోంది.






