- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘బంద్’ వేళ చికెన్ షాప్ తెరుస్తావా ? యజమానిపై దాడి !
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లోని ఒక చికెన్ షాప్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా దుకాణాలు మూసివేస్తున్నట్లు చికెన్ షాపుల సంఘం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని చికెన్ దుకాణాలు మూతపడ్డాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లోని ఒక చికెన్ షాప్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ చికెన్ షాప్ ఓనర్, అసోషియేషన్ నిర్ణయాన్ని కాదని దుకాణం ఓపెన్ చేశాడు.
ఈ తరుణంలోనే బంద్ కు వ్యతిరేకంగా చికెన్ షాప్ తెరవడంతో, యజమానితో చికెన్ షాప్ అసోసియేషన్ సభ్యులు వాగ్వాదానికి దిగారు. ‘బంద్ వేళ చికెన్ షాప్ ఎలా తెరుస్తావు?’ అని ఓనర్ తో గొడవకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట నెలకొంది. అటు దుకాణంలోని కోడిగుడ్ల ట్రేలను రోడ్డుపై పడేసిన అసోసియేషన్ సభ్యులు.. రచ్చ చేశారు. అటు ఓనర్ పై దాడి జరిగినట్లు కూడా తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
అసలు చికెన్ దుకాణాలు ఎందుకు బంద్ ?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ దుకాణాలు మూతపడ్డాయి. నేటి నుంచి సమ్మెకు దిగాయి. పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే లాభాల మార్జిన్ అమాంతం తగ్గించాయని రిటైల్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలో చికెన్ పై రూ.30కి పైగా వరకు మార్జిన్ పెంచాలని తెలంగాణ చికెన్ ఓనర్స్ అసోసియేషన్ కోరుతోంది. గతంలో కిలో చికెన్ పైన రూ. 26 మార్జిన్ ఉండగా, దానిని రూ.16కు తగ్గించారు. ఈ క్రమంలోనే బంద్ కు పిలుపునిచ్చారు అసోసియేషన్ సభ్యులు. క్లిక్





