- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో ఎన్నికల కోడ్.. పండుగ వేళ సామాన్యుల్లో భయాందోళన
ఎన్నికల షెడ్యూల్విడుదలై వెంటనే రాష్ట్రంలో కోడ్అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో నగదు రవాణాపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. నగదును తీసుకెళ్లే విషయంలో జిల్లా అధికారులకు కూడా స్పష్టత లేదు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల షెడ్యూల్విడుదలై వెంటనే రాష్ట్రంలో కోడ్అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో నగదు రవాణాపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. నగదును తీసుకెళ్లే విషయంలో జిల్లా అధికారులకు కూడా స్పష్టత లేదు. ఎన్నికల సంఘం ఇచ్చే ఆదేశాలు, మార్గదర్శకాల కోసం అంతా ఎదురుచూస్తున్నారు. అప్పటిదాకా నగదు పట్టుకోవడం సాధ్యం కాదని చెబుతున్నారు. దసరా పండగ వేళ షాపింగ్, ఇతర అవసరాలకు నగదు తీసుకెళ్లేందుకు పలువురు భయాందోళన చెందుతున్నారు. అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలకు ఒకే విధమైన నిబంధనలు ఉంటాయా? అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండగల్లో దసరా ఒకటి. ఈ సమయంలో మాసాంహారం, మద్యం కొనుగోలు సహజంగానే ఉంటుంది. వీటికోసం పెద్దఎత్తున డబ్బులు వెచ్చిస్తుంటారు. ఇప్పుడు తీసుకెళ్లాలా? వద్దా? అని ఆందోళన చెందుతున్నారు.
అమల్లోకి ఎన్నికల రూల్స్
ఎన్నికల షెడ్యూల్‌విడుదల కావడంతో జిల్లా యంత్రాంగం బిజీబిజీగా మారింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంగళవారం జిల్లాల కలెక్టర్లు రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. జిల్లాల యంత్రాంగం తీసుకున్న చర్యలను పార్టీల ప్రతినిధులకు వివరించారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ప్రిసైడింగ్అధికారులకు శిక్షణలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నోడల్ఆఫీసర్లతో సమావేశాలు నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా జరగడానికి పార్టీలు సహకరించాలని కలెక్టర్లు కోరారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, ఎన్నికల నిబంధనలను పడక్బందీగా అమలయ్యేలా సహకరించాలని సూచించారు.
సోషల్ మీడియాపై నిఘా
రాజకీయ పార్టీల మీటింగులు, ర్యాలీలు అనుమతులు తీసుకోవాలని, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదని, సోషల్ మీడియాలో అసత్య వార్తలు ప్రసారం చేయొద్దని, రాజకీయ పార్టీ నాయకులకు అధికారులు సూచించారు. పోలింగ్‌కు 48 గంటలు ముందే ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాలని అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరారు. మున్సిపాలిటీల్లో ఎన్నికల కోడ్ అమలులో లేదని, ఆ ఏరియాలో అభివృద్ధి పనులు అధికారులతో చేయించుకోవచ్చని తెలిపారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, గ్రౌండింగ్ వంటివి ఉండకూడదని స్పష్టం చేశారు. తాగునీరు, విద్య, వైద్యం అవసరాలకు ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఉంటుందని నాయకులకు తెలిపారు. ముఖ్యంగా ప్రార్థనా మందిరాల్లోకి ఎలాంటి పార్టీ జెండాలతో ప్రవేశం లేదని చెప్పారు. సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచారం, అసత్య ప్రచారాన్ని ప్రసారం చేస్తే డీపీఆర్వో ద్వారా చర్య తీసుకుంటామని కలెక్టర్లు హెచ్చరించారు. పోలింగ్ కేంద్రంలోకి ఎలాంటి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి ఉండదని, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేలా నగదు, మద్యం, పంపిణీ చేయొద్దని సూచించారు. జిల్లాలోని చెక్ పోస్టుల్లో వాహనాల తనిఖీలను పకడ్బందీగా చేపట్టనున్నారు.






