హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత (వీడియో)

by Disha Web Desk 2 |
హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదారాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై సోమవారం హైదరాబాద్ అబిడ్స్‌లోని కలెక్టరేట్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నించింది. రాష్ట్రంలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్నా సీఎం కేసీఆర్ స్పందించట్లేదని యూత్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. యూత్ కాంగ్రెస్ నగర అధ్యక్షుడు మోత రోహిత్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు రోడ్డుపై యూత్ కాంగ్రెస్ నేతలు బైఠాయించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు.

ఎమ్మెల్సీ కవిత ఈడీ కేసు నుండి కాపాడుకోవడానికి ఢిల్లీకి వెళ్తున్న రాష్ట్ర మంత్రివర్గానికి నిరుద్యోగుల బాధ అర్థం కావడం లేదని ఆవేదనవ్యక్తం చేశారు. పేపర్ లీకేజీకీ బాధ్యులుగా టీఎస్పీఎస్పీ ఛైర్మెన్ జనార్దన్ రెడ్డిని భర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని వారు కోరారు. పేపర్ లీక్‌పై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని యూత్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు నేతలు చేరుకున్నారు. ఒక్కసారిగా గేటును నెట్టుకుంటూ లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో, పోలీసులకు నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది.


Next Story