- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హ్యామ్ రోడ్లకు వచ్చే వారం టెండర్లు : మంత్రి కోమటిరెడ్డి
హ్యామ్ రోడ్ల నిర్మాణాలకు వచ్చే వారంలో టెండర్లు పిలువనున్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

- మూడేళ్లలో పూర్తి చేసేందుకు లక్ష్యం
- నాకు డిపార్ట్ మెంట్ తప్పా వేరే పనిలేదు
దిశ, తెలంగాణ బ్యూరో: హ్యామ్ రోడ్ల నిర్మాణాలకు వచ్చే వారంలో టెండర్లు పిలువనున్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం సెక్రటేరియట్ లో టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎన్.హెచ్.ఏ.ఐ(NHAI), ఎం.ఓ.ఆర్.టీ.హెచ్(MoRTH), ప్రాజెక్ట్స్ కు సంబంధించి పనుల పురోగతిపై చర్చించారు. విద్యుత్ లైన్ షిఫ్టింగ్, వాటర్ యుటిలిటీ క్లియరెన్స్, ఫారెస్ట్ క్లియరెన్స్ సంబంధిత అంశాలపై మంత్రి సమీక్షించారు. సమావేశంలో రాష్ట్ర స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్, విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, నీటిపారుదల, పంచాయతీ రాజ్, అటవీ శాఖ, మైనింగ్ శాఖల అధికారులు, NHAI, MoRTH రీజినల్ ఆఫీసర్స్, రైల్వే అధికారులు ఉన్నారు. అనంతరం చిట్ చాట్ లో మంత్రి మాట్లాడారు. మొదలు పెట్టిన అన్ని రోడ్ల నిర్మాణాలను వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాలన్న లక్ష్యం పెట్టుకున్నట్లు వివరించారు. నాకు నా శాఖ తప్పా వేరే పనిలేదని, అందుకే వర్క లన్ని స్పీడ్ చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఫస్ట్ ఫేజ్ లో రూ.6వేల కోట్లతో రోడ్ల నిర్మాణం పనులు మొదలు పెడుతున్నట్ల చెప్పారు. ట్రిబుల్ ఆర్ (RRR) పై ఈ నెలాఖరు నాటి క్లారిటీ వస్తుందని చెప్పారు. 90 శాతం భూ సేకరణ పూర్తి అయిందన్నారు. ఈ నెల 12న హ్యామ్ రోడ్ పై కాంట్రాక్టర్ల తో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. Slbc పనులు కూడా త్వరలో ప్రారంభం కాబోతున్నాయన్నారు. కేంద్ర మంత్రి గడ్కరీతో జరిగిన సమావేశంలో పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారులకు, విజయవాడకు ఫ్యూచర్ సిటీ నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవే మంజూరు చేసేందుకు అంగీకరించారని, ట్రిబుల్ ఆర్ నార్త్ పార్ట్ ఈ నెలలో కేంద్ర కేబినెట్ లో ఆమోదం తెలుపనున్నట్లు గడ్కరీ హామీ ఇచ్చారని అన్నారు. టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్ జరుగడం రాష్ట్రంలో ఇదే తొలిసారి అని చెప్పారు. అన్ని శాఖల అధికారులతో అభివృద్ధి పనులపై చర్చించామని పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు వీలుపడుతుందని చెప్పుకొచ్చారు. సనత్ నగర్ టీమ్స్ అక్టోబర్ లో ఓపెన్ చేస్తామని, ప్రస్తుతం పనులన్ని చివరి దశ కు వచ్చాని చెప్పారు. మెడికల్ పరికరాలు వచ్చే నెలలో తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు.
ఢిల్లీ ధర్నా గ్రాండ్ సక్సెస్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును పాస్ చేయించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తలపెట్టిన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ధర్నా గ్రాండ్ సక్సెస్ అయిందన్నారు. రాహుల్ గాంధీ, ఖర్గే సడెన్ ప్రోగ్రామ్స్ వల్ల రాలేకపోయారు. శింబూ సోరెన్ మరణించడంతో రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళాల్సి వచ్చిందని, ఇండియా కూటమి ఎంపీలు ధర్నాకు వచ్చారని వివరించారు. కాంగ్రెస్ పార్టీలో ఫోన్ ట్యాపింగ్ సిస్టం లేదని స్పష్టం చేశారు. 10 ఏళ్ల అవినీతిపై కమిషన్ లతో విచారణ జరిపిస్తున్నామని అన్నారు. 20 నెలల కాంగ్రెస్ పాలనలో కేటీఆర్ తన డైరీలో పేర్లు రాసుకుంటున్నామని చెబుతున్నారు. గత పదేళ్ల BRS పాలనలో మా కార్యకర్తలులో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మేము రాయాలంటే ఎన్నో పేర్లు డైరీ లో రాసుకోవాలి, కాని ఏనాడు కూడా మేము అలా మాట్లాడలేదు, డైరీలో రాసుకోలేదని చెప్పారు. కలెక్టర్లను, ఎస్పీలను కూడా కేటీఆర్ తిడుతున్నారని మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై విలేకర్లు అడిగిన పశ్నకు మంత్రి కోమటిరెడ్డి సైలెంట్ గా ఉన్నారు. జగదీష్ రెడ్డిపై అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ జగదీష్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి నాది కాదని అన్నారు. ఉమ్మడి నల్గొండ అభివృద్ధి నా లక్ష్యం. నల్గొండ రింగ్ రోడ్ టెండర్స్ పిలిచామని చెప్పారు.
నేడు సినిమా కార్మికులతో సమావేశం
శుక్రవారం సినిమా కార్మికులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో దిల్ రాజుతో పాటు పలువురు నిర్మాతలు భేటీకి వస్తారు. సినీ కార్మికులకు, నిర్మాతల మధ్య జరుగుతున్న వివాదాల నేపథ్యంలో సమ్మె సరుగుతుందని దానిని పరిష్కరించేందుకే సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశం అనంతరం ఇదో కొలిక్కి వస్తుందని అన్నారు.






