మామునూర్ ఎయిర్ పోర్టు భూముల సర్వేకు టెండర్

by Elthuri vijay kumar |

మామునూర్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో నిర్మించిన మమునూర్ ఎయిర్ పోర్టు భూముల సర్వే కోసం ఎయిర్ పోర్టు అథారిటీ అఫ్ ఇండియా టెండర్లు పిలించింది.

మామునూర్ ఎయిర్ పోర్టు భూముల సర్వేకు టెండర్
X

మామునూర్ ఎయిర్ పోర్టు భూముల సర్వేకు టెండర్

టెండర్లు పిలిచిన ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా

రెండు నెలలలోపు హద్దులు నిర్ణయించాలని ఆదేశాలు

విమానాశ్రయం నిర్మాణానికి వడివడిగా అడుగులు

దిశ వరంగల్ బ్యూరో: మామునూర్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో నిర్మించిన మమునూర్ ఎయిర్ పోర్టు భూముల సర్వే కోసం ఎయిర్ పోర్టు అథారిటీ అఫ్ ఇండియా టెండర్లు పిలించింది. రెవెన్యూ రికార్డుల ఆధారంగా ఎయిర్ పోర్టుకు సంబంచిన 740 ఎకరాల భూములకు సంబంచిన సర్వే చేపట్టాలని కోరింది. భూములకు సంబంధించి మ్యాపింగ్ చేయడంతో పూర్తిస్థాయిలో గుర్తించి రెండు నెలలలోపు హద్దులు నిర్ణయించాలని కోరింది. ఈ ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం ప్రస్తుతం ఉన్న భూములే కాకుండా అదనంగా రైతుల నుంచి మరో 220 ఎకరాల వరకు సేకరిస్తున్నారు. మూడు గ్రామాల పరిధిలో ఉన్న భూముల రైతులతో మాట్లాడారు. ఒక గ్రామం పరిధిలోని రైతులతో రెవెన్యూ అధికారులు ఒప్పందం కూడా చేశారు. మిగతా రైతులతో చర్చిస్తున్నారు. ఎకరాకు రూ.కోటి 40 లక్షలుగా నిర్ణయించారు. కేంద్రం ఎయిర్ పోర్టు నిర్మాణానికి నిర్ణయించడంతో యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేస్తున్నారు. ఎయిర్ పోర్టు నిర్మాణానికి భూసేకరణ పూర్తయిన తర్వాత నిర్మాణం చేపట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Next Story