కరెంట్ షాక్ తో కౌలు రైతు మృతి

by Elthuri vijay kumar |

మండలంలోని ముధేల్లి గ్రామంలో కరెంట్ షాక్ తో కౌలు రైతు మరణించిన ఘటన చోటుచేసుకుంది.

కరెంట్ షాక్ తో కౌలు రైతు మృతి
X

కరెంట్ షాక్ తో కౌలు రైతు మృతి

- పొలానికి నీరు పెడుతుండగా ఘటన

- గాంధారి మండలం ముధేల్లి గ్రామంలో విషాదం

దిశ, గాంధారి: మండలంలోని ముధేల్లి గ్రామంలో కరెంట్ షాక్ తో కౌలు రైతు మరణించిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ముధేల్లి గ్రామానికి చెందిన కర్రోల్ల సాయిలు (57) అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన కాగుల మొగులయ్య అనే రైతుకు చెందిన పొలాన్ని కౌలుకు తీసుకుని వరి పంట సాగు చేస్తున్నాడు. సోమవారం పొలంలో కలుపు తీయడానికి తన భార్య లలితతో కలిసి పొలానికి వెళ్లారు. కాగా మధ్యాహ్నం సమయంలో లలిత భోజనం తీసుకురావడానికి తమ ఇంటికి వెళ్లగా సాయిలు పొలంలో నీరు పెట్టడానికి మోటార్ స్టార్టర్ వద్దకు వెళ్లి స్టార్టర్ ను ముట్టుకోగా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్టు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు.

Next Story