Kishan Reddy : వారిపై పదేళ్లకు వ్యతిరేకత..వీరిపై ఏడాదికే...!: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by Y. Venkata Narasimha Reddy |

బీఆర్ఎస్(BRS) పార్టీకి పదేళ్ల పాలనలో వచ్చిన ప్రజా వ్యతిరేకత కంటే ఎక్కువగా రాహుల్ గాంధీ నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం(CM Revanth Reddy Government) ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి(Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

Kishan Reddy : వారిపై పదేళ్లకు వ్యతిరేకత..వీరిపై ఏడాదికే...!: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్(BRS) పార్టీకి పదేళ్ల పాలనలో వచ్చిన ప్రజా వ్యతిరేకత కంటే ఎక్కువగా రాహుల్ గాంధీ నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం(CM Revanth Reddy Government) ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి(Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.నల్లగొండలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సరోత్తమ్ రెడ్డి గెలుపు కోరుతూ ప్రచారం సాగించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిక కిషన్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలలో బీజేపీ అభ్యర్థులు సరోత్తమ్ రెడ్డి, మల్క కొమురయ్య, అంజిరెడ్డిలు పోటీలో ఉన్నారని..వారిని ఉపాధ్యాయులు, మేధావులు, పట్టభద్రులు గెలిపించాలని కోరారు. ఈ మూడు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనన్నారు.

గతంలో గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీలంటే శాసన మండలిలో ప్రభుత్వాన్ని చర్చల్లో చీల్చిచెండేవారని..ప్రస్తుతం పాలక పార్టీలకు సలామ్ లు కొట్టేవారు వస్తున్నారన్నారు. దీంతో ఆయా వర్గాల ప్రజల పరిష్కారం సాధ్యపడటం లేదన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలలో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత నెలకొందన్నారు. శాసన మండలి ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు ఉపాధ్యాయ, విద్యావంతులు, తెలంగాణ ఉద్యమ జేఏసీలోని సంఘాలు సహకరిస్తున్నాయన్నారు.

కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పి..2024డిసెంబర్ లోపల 2లక్షల ఉద్యోగాల భర్తీని ప్రకటించి అందుకు చర్యలు తీసుకోకపోవడాన్ని ఈ రోజు నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారన్నారు. ఆరు గ్యారంటీల అమలు జరుగడం లేదని..అమలు చేసే శక్తి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యమైందన్నారు. నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు చేస్తామని, యూనివర్సీటీలను అప్ గ్రేడ్ చేస్తామని చెప్పారని, రూ.4వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఇవ్వలేదన్నారు. పీఆర్సీ, డీఏలు అమలు కావడం లేదని..ఆరు డీఏలు పెండింగ్ లో ఉన్నాయన్నారు.

రిటర్మైంట్ బెనిఫిట్స్ కూడా ప్రభుత్వం ఇవ్వకలేకపోతుందన్నారు. 8వేల కోట్ల ఫీజురీఎంబర్స్ మెంట్ బకాయిలు ఇవ్వకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందిపడుతున్నారన్నారు. చివరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్ షిప్ లు కూడా ఇవ్వడం లేదన్నారు. గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్యల పాలవుతున్నారన్నారు. విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తామని ఇవ్వలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటనలు చేస్తూ చిన్న హామీలను కూడా అమలు చేయడం లేదన్నారు. రైతు రుణమాఫీ పూర్తి కాలేదని..రైతుభరోసా, రైతు కూలీలకు ఆర్థిక సహాయంపై పిల్లిమెగ్గలు వేస్తుందని విమర్శించారు.

మహిళలకు ఇస్తామన్న రూ.2,500, వృద్ధుల పెన్షన్ ల పెంపు అతిగతి లేదన్నారు. జీవో 317పైన 50వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు దరఖాస్తుందించగా..వాటిని పరిష్కరించలేదని గుర్తు చేశారు. విద్యా రంగంలో అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని..అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కిషన్ రెడ్డి కోరారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల కోసం తెలంగాశ విద్యావంతులు, మేధావులు, కళాకారులు, పట్టభద్రులు బీజేపీని గెలిపించాలని కోరారు. కేంద్రంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రగతికి చేస్తున్న కృషికి మద్ధతునివ్వాలన్నారు. కేంద్రం తెలంగాణ అభివృద్ధికి తీసుకున్న చర్యలను వివరించారు.

Next Story