దద్దరిల్లిన దండకారణ్యం.. ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు మృతి

by Gantepaka Srikanth |   (  Updated:2025-09-11 15:24:29  IST  )

ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని సుక్మా జిల్లా దండకారణ్యం మరోసారి దద్దరిల్లింది.

దద్దరిల్లిన దండకారణ్యం.. ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని సుక్మా జిల్లా దండకారణ్యం మరోసారి దద్దరిల్లింది. గురువారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్(Encounter) జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో దాదాపు 10 మంది మావోయిస్టులు మృతిచెందారు(Ten Maoists Dead). మృతుల్లో తెలంగాణలోని వరంగల్‌కు చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు మొడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్‌తో పాటు ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రమోద్‌ అలియాస్ పాండు కూడా ఉన్నారు. మరికొందరు కీలకనేతలు చనిపోయినట్టు పోలీసులు భావిస్తున్నారు. మనోజ్ పేరిట రూ.కోటి రివార్డు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం గత కొన్ని రోజులుగా కాల్పుల మోతతో అట్టుడికిపోతోంది. ఇటీవలే బీజాపుర్‌ జిల్లాలోని నేషనల్ పార్క్‌లో జరిగిన ఆపరేషన్‌లో పదుల సంఖ్యలో మావోయిస్టులు మృతిచెందిన సంగతి తెలిసిందే. వారి మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇది జరిగిన కొన్ని రోజులకే ఏకంగా పది మంది మావోయిస్టులను కోల్పోవడం పార్టీకి భారీ ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.




Next Story