- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రవ్యాప్తంగా పది పరీక్షలు ప్రారంభం.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
రాష్ట్రంలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే అరగంట ముందే విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోవాలని SSC బోర్డు అధికారులు తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా 10 తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎస్ఎస్‌సీ బోర్డు అధికారులు విద్యార్థులకు కీలక ప్రకటన చేశారు. అర గంట ముందుగానే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఈ పరీక్షలు ఏప్రిల్ 16 వరకు కొనసాగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అందులో 2,60,916 మంది అబ్బాయిలు కాగా.. 2,56,811 మంది అమ్మాయిలు ఉన్నారు. పరీక్ష నిర్వహణకు గాను మొత్తం 2,676 కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షల్లో ఎక్కడా ఎలాంటి అవకతవకలు జరగకుండా 144 మంది ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించుతున్నారు. విద్యార్థులు ఎటువంటి భయాందోళనలు లేకుండా పరీక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. అదేవిధంగా విద్యార్థులు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రాలలోకి అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
పది పరీక్షల షెడ్యూల్ ఇలా:
మార్చి 14, 2026 (శనివారం): ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్-ఏ), ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్-I, పార్ట్-II
మార్చి 18, 2026 (బుధవారం): సెకండ్ లాంగ్వేజ్
మార్చి 23, 2026 (సోమవారం): థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)
మార్చి 28, 2026 (శనివారం): మ్యాథమెటిక్స్
ఏప్రిల్ 2, 2026 (గురువారం): సైన్స్ పార్ట్-I (ఫిజికల్ సైన్స్)
ఏప్రిల్ 7, 2026 (మంగళవారం): సైన్స్ పార్ట్-II (బయోలాజికల్ సైన్స్)
ఏప్రిల్ 13, 2026 (సోమవారం): సోషల్ స్టడీస్
ఏప్రిల్ 15, 2026 (బుధవారం): ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-I (సంస్కృతం, అరబిక్), స్ఎస్‌సీ వొకేషనల్ కోర్స్ (థియరీ)
ఏప్రిల్ 16, 2026 (గురువారం): ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-II (సంస్కృతం, అరబిక్)






