తెలంగాణపై భానుడి ప్రతాపం: నిప్పుల కొలిమిలా రాష్ట్రం!

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-15 10:02:20  IST  )

తెలంగాణ రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తెలంగాణపై భానుడి ప్రతాపం: నిప్పుల కొలిమిలా రాష్ట్రం!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌ కు చేరుకునే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వడదెబ్బ (Heatstroke) కేసులు పెరిగే అవకాశం ఉన్నందున, ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు.

వైద్య శాఖ సన్నద్ధత...

అన్ని ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేకంగా బెడ్లను కేటాయించాలి. ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లు, ఐవీ ఫ్లూయిడ్స్, అవసరమైన అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలి. బాధితులు ఆస్పత్రికి వచ్చిన వెంటనే ఎటువంటి జాప్యం లేకుండా చికిత్స అందించేలా సిబ్బందిని అప్రమత్తం చేయాలని మంత్రి సూచించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు మరింత జాగ్రత్తగా ఉండాలని, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి తగినన్ని నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలని కోరుతున్నారు.

Next Story