బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన ఎక్సలెంట్ ఆణిముత్యం

by Batti.Sumithra |

పినపాక మండల పరిధిలోని ఏడూళ్ల బయ్యారం ప్రైవేట్ పాఠశాల ఎక్సలెంట్ భాషా హై స్కూల్ విజయాలకు కేంద్రంగా నిలుస్తోంది.

బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన ఎక్సలెంట్ ఆణిముత్యం
X

దిశ, పినపాక : పినపాక మండల పరిధిలోని ఏడూళ్ల బయ్యారం ప్రైవేట్ పాఠశాల ఎక్సలెంట్ భాషా హై స్కూల్ విజయాలకు కేంద్రంగా నిలుస్తోంది. పోటీ పరీక్ష ఏదైనా ర్యాంకులను సొంతం చేసుకుంటూ మండలంలో ముందువరుసలో నిలుస్తుంది. తాజగా విడుదల చేసిన బాసర త్రిబుల్ ఐటీ ఫలితాలలో ఈ పాఠశాలకు చెందిన డి.షణ్ముఖ ప్రియ ఆర్జీయూకేటీ బాసరలో సీటు సంపాదించింది. ఈ సందర్భంగా ఎక్సలెంట్ భాషా హై స్కూల్ యాజమాన్యం షణ్ముఖను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ యూసఫ్ షరీఫ్ మాట్లాడుతూ మా పాఠశాల విద్యార్థిని ట్రిపుల్ ఐటీలో సీటు సాధించడం గర్వించదగ్గ విషయం అన్నారు. బట్టి విధానానికి స్వస్తి చెప్పి విద్యార్థుల అవగాహన శక్తిని పెంపొందించే అభ్యసనా పద్ధతులను పాటించడం మూల కారణమని తెలిపారు. పోటీ పరీక్షలలో వరుస ఫలితాలే దీనికి నిదర్శనం అన్నారు. ఈ విజయం పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మండల ప్రజలు గర్వించదగినదన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ ఖాదర్, గబ్బర్, బండారు నరేంద్ర, ముక్కు వెంకట నర్సారెడ్డి, ప్రిన్సిపల్ అంకం సురేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Next Story