- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Telangana: తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు..పలు జిల్లాల్లో 35 డిగ్రీల పైనే
రాష్ట్రంలో రెండు రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రెండు రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. గత రెండు రోజులుగా రాష్ట్రంలో ఉక్కపోతతో కూడా వాతావరణం ఉంటుందని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు నెమ్మదించడంతోనే గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగినట్లు తెలిపింది. రాగల రెండు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, కొమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
పలు ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు
ప్రాంతం నమోదైన ఉష్ణోగ్రత
ఆదిలాబాద్ 36.3
భద్రాచలం 36.6
హకీంపేట్ 34.1
దుండిగల్ 34.2
హన్మకొండ 36
హైదరాబాద్ 33.8
మహబూబ్ నగర్ 30
మెదక్ 33.4
నిజామాబాద్ 35.5
రామగుండం 36.3
పటాన్చెరు 32.4
రాజేంద్రనగర్ 33
హయత్ నగర్ 32.6






