- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మార్పు.. ఇక నుంచి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌గా నామకరణం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం GHMC స్టాండింగ్ కమిటీ సమావేశం అయింది.

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం GHMC స్టాండింగ్ కమిటీ సమావేశం అయింది. ఈ సమావేశంలో 14 అంశాలను ఆమోదిస్తూ GHMC స్టాండింగ్ కమిటీ తీర్మానం చేసింది. ఇందులో పలు అభివృద్ధి పనులకు ఆమోదం లభించింది. తెలుగు తల్లి ఫ్లైఓవర్(Telugu Thalli Flyover)ను తెలంగాణ తల్లి ఫ్లైఓవర్(Telangana Thalli Flyover)గా మారుస్తూ తీర్మానం చేశారు. ఫ్లైఓవర్‌కు రెండువైపులా ఆర్చ్ నిర్మించేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. 1.1 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ ఫ్లైఓవర్‌పై నిత్యం రద్దీ అధికంగా ఉంటుంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ఫ్లైఓవర్ పేరును తెలుగు తల్లి ఫ్లై ఓవర్ అని పెట్టారు. తాజాగా పేరు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపింది.






