విదేశాల్లో తెలుగోళ్ల పైత్యం..గ్రాడ్యుయేషన్ డేలో పార్టీ జెండాల ప్రదర్శన

by Ajay Maddhiboyina |   (  Updated:2025-05-19 11:35:26  IST  )

విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లిన కొంతమంది తెలుగు విద్యార్థులు తమ పైత్యంతో పరువు తీసుకుంటున్నారు. యూనివర్సిటీల్లో గ్రాడ్యుయషన్ డే సందర్భంగా డిగ్రీ పట్టాలు అందుకుని ఆ తరవాత పార్టీల జెండాలను ప్రదర్శిస్తున్నారు.

విదేశాల్లో తెలుగోళ్ల పైత్యం..గ్రాడ్యుయేషన్ డేలో పార్టీ జెండాల ప్రదర్శన
X

దిశ, వెబ్ డెస్క్: విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లిన కొంతమంది తెలుగు విద్యార్థులు తమ పైత్యంతో పరువు తీసుకుంటున్నారు. యూనివర్సిటీల్లో గ్రాడ్యుయషన్ డే సందర్భంగా డిగ్రీ పట్టాలు అందుకుని ఆ తరవాత పార్టీల జెండాలను ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది ప్రొఫెసర్లకు చిరాకు వచ్చి ఆ జెండాలను లాగేస్తున్నారు. దీంతో అందరి ముందు పరువు పోగొట్టుకుంటున్నారు.

దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవ్వడంతో కేవలం ఆ కార్యక్రమంలోనే కాకుండా సోషల్ మీడియాలోనూ నవ్వులపాలు అవుతున్నారు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల అభిమానులే ఈ జెండాలను ఎగరవేస్తున్నారు. మొన్న ఓ విద్యార్థి గ్రాడ్యుయేషన్ డేలో ప్రదర్శించాడు. అంతే కాకుండా ఒకే వ్యక్తి టీడీపీ మరియు జనసేన జెండాలను గ్రాడ్యుయేషన్ డేలో ప్రదర్శించే ప్రయత్నం చేశాడు.

కానీ ఈ క్రమంలో పక్కనే ఉన్న ప్రొఫెసర్ అతడి చేతిలో జెండాను లాక్కుని పక్కన పడేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవ్వడంతో చదువుకోవడానికి వెళ్లారా.. పిచ్చి చేష్ఠలు చేయడానికి వెళ్లారా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక్కడ చదవకుండా జులాయిగా తిరుగుతున్నాడని విదేశాలకు పంపిస్తే అక్కడ కూడా అవే కథలు పడుతున్నారంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. అంతే కాకుండా విదేశాల్లో తెలుగు వాళ్ల ప‌రువు తీస్తున్నార‌ని, ఒక‌రిని చూసి మ‌రొక‌రు త‌యార‌వుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Next Story