- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీటి కలుషిత వ్యాధుల్లో తెలుగు రాష్ట్రాలు బెటర్.. కేరళ, కర్ణాటకలో రికార్డు స్థాయి కేసులు!
దేశవ్యాప్తంగా కలుషిత నీటి వ్యాధుల్లో పొరుగు రాష్ట్రాల కంటే తెలంగాణలో పరిస్థితి మెరుగ్గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో కలుషిత నీరు ప్రాణాంతకంగా మారుతున్నది. మౌలిక సదుపాయాలు పెరుగుతున్నాయని చెబుతున్నా.. మంచినీటి కొరత సామాన్యుడిని ఆస్పత్రుల పాలు చేస్తున్నది. గడిచిన ఐదేళ్లలో (2021-2025) దేశవ్యాప్తంగా 1,79,36,577 మంది నీటి కలుషిత వ్యాధుల (వాటర్ బోర్న్ డిసీజెస్) బారిన పడ్డారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఐదేళ్లలో (2021-2025) దేశవ్యాప్తంగా లక్షలాది మంది డయేరియా, టైఫాయిడ్, కలరా వంటి వ్యాధుల బారిన పడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య లోపం, సురక్షిత మంచినీటి కొరత ఈ వ్యాధుల తీవ్రతకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.
డయేరియాదే అగ్రస్థానం
గడిచిన ఐదేళ్లలో నమోదైన కేసులను పరిశీలిస్తే, దేశంలో అక్యూట్ డయేరియల్ డిసీజెస్ (ఏడీడీ) అత్యధికంగా ఉన్నాయి. 2021లో సుమారు 60 లక్షల పైచిలుకు డయేరియా కేసులు నమోదు కాగా, 1.95 లక్షల టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. 2024 నాటికి హెపటైటిస్-ఏ, లెప్టోస్పైరోసిస్ వంటి వ్యాధుల తీవ్రత కూడా పెరిగినట్లు డేటా స్పష్టం చేస్తున్నది. 2021తో పోలిస్తే 2024, 2025 సంవత్సరాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు పెరగడం వల్ల కేసుల సంఖ్య కూడా భారీగా కనిపిస్తున్నది.
ఉత్తరాది, దక్షిణాది మధ్య వ్యత్యాసం
వ్యాధుల వ్యాప్తిలో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తున్నది. కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కేసుల నమోదు సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. దీనికి ప్రధాన కారణం అక్కడి బలమైన సర్వైలెన్స్ సిస్టమ్ (వ్యాధులను గుర్తించే విధానం) అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఉదాహరణకు కేరళలో లెప్టోస్పైరోసిస్ కేసులు దేశంలోనే అత్యధికంగా నమోదవుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో టైఫాయిడ్, డయేరియా కేసులు వేలల్లో ఉంటున్నాయి. జనాభా ప్రాతిపదికన చూస్తే యూపీలో కేసుల సంఖ్య భారీగా ఉన్నప్పటికీ, దక్షిణాదితో పోలిస్తే కొన్ని రకాల వ్యాధుల రిపోర్టింగ్ తక్కువగా ఉంటున్నది.
తెలంగాణ పరిస్థితి ఇలా..
దేశవ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో తెలంగాణ 12వ స్థానంలో ఉన్నది. 2021లో 1.14 లక్షల డయేరియా కేసులు ఉండగా, 2025 నాటికి అది 38,612కి తగ్గినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇక రాష్ట్రంలో టైఫాయిడ్ కేసులు ఏటా సగటున ఆరు వేల నుండి 20 వేల మధ్య ఊగిసలాడుతున్నాయి. దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో నీటి కలుషిత వ్యాధుల తీవ్రత తక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. రాష్ట్రంలో కలరా, లెప్టోస్పైరోసిస్ వ్యాధుల ప్రభావం దాదాపు శూన్యం.
దక్షిణాదిలో ఇలా..
దక్షిణాది రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పరంగా చూస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకంటే మెరుగ్గా ఉన్నాయి. కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో డయేరియా, ఇతర ఇన్ఫెక్షన్ల సంఖ్య చాలా ఎక్కువగా (లక్షల్లో) నమోదవుతున్నది. కేసుల రిపోర్టింగ్ ఎక్కువగా ఉండటం ఆయా రాష్ట్రాల ఆరోగ్య వ్యవస్థ పనితీరుకు నిదర్శనమైనప్పటికీ, వ్యాధుల నియంత్రణలో మాత్రం తెలంగాణ, ఏపీలు తక్కువ కేసులతో కొంత బెటర్ పొజిషన్‌లో ఉన్నాయి. దక్షిణాదిలోని కేరళ (3.5 లక్షలు), కర్ణాటక (1.8 లక్షలు), తమిళనాడు (73 వేలు)తో పోలిస్తే తెలంగాణ చాలా మెరుగైన స్థితిలో (38 వేల కేసులు) ఉంది. ఇది రాష్ట్ర మంచినీటి సరఫరా వ్యవస్థ (మిషన్ భగీరథ వంటివి) ప్రభావం కావచ్చని అంచనా. కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ హెల్త్ గైడ్‌లైన్స్ ఫర్ ఫ్లడ్ ఈవెంట్స్ ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొంది. గ్రామాల్లోని తాగు నీటి సంఘాల ద్వారా నీటి నాణ్యత పరీక్షలు నిరంతరం జరగాలని, చేతులు శుభ్రం చేసుకోవడం వంటి ప్రాథమిక సూత్రాలను పాటిస్తేనే ఈ మహమ్మారుల నుంచి బయటపడగలమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఐదేళ్లలో నమోదైన కేసుల వివరాలు ఇలా..






