- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సోషల్ మీడియా యాక్టివిస్ట్ గౌతమ్ అర్ధరాత్రి అరెస్ట్..మాజీ మంత్రి హరీశ్‌రావు రియాక్ట్.. సీసీటీవీ ఫుటేజ్ వైరల్
ప్రముఖ సామాజిక మాధ్యమం తెలుగు స్క్రైబ్‌కు చెందిన గౌతమ్ అనే సోషల్ మీడియా యాక్టివిస్టును పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ సామాజిక మాధ్యమం (Telugu scribe) తెలుగు స్క్రైబ్‌కు చెందిన గౌతమ్ గౌడ్ అనే సోషల్ మీడియా యాక్టివిస్టును పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి ఉప్పల్ లోని తన నివాసంలో అదుపులోకి సైబరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అరెస్ట్‌పై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, గౌతమ్‌ను అర్ధరాత్రి అరెస్టు చేయాల్సినంత తప్పు ఆయనేమీ చేయలేదనీ, తమకు వ్యతిరేకంగా వార్తలు రాసేవారిని భయపెట్టడానికే సీఎం రేవంత్ పోలీసులను వాడుకుంటున్నారని బీఆర్ఎస్ లీగల్ సెల్ సి.కళ్యాణ్ రావు తెలిపారు. గౌతమ్ విడుదలకు న్యాయపరంగా తమ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తాజాగా వెల్లడించారు. ఈ అరెస్ట్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) ఎక్స్ వేదికగా స్పందిచారు.
అర్ధరాత్రి వెళ్లి, (Social media activist Gowtham Goud) సోషల్ మీడియా యాక్టివిస్ట్ గౌతమ్ ను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ అక్రమాలను, ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసిన వైనాన్ని ప్రశ్నిస్తే టార్గెట్ చేసి కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. ఇది పూర్తి అప్రజాస్వామిక చర్య అని, ప్రజా పాలన అంటే ఇదేనా? అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. అక్రమంగా అరెస్టు చేసిన గౌతమ్‌ను వెంటనే విడిచిపెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా, గౌతమ్ అరెస్ట్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఫేక్ న్యూస్‌లు క్రియేట్ చేసే వారిని అరెస్ట్ చేయాల్సిందేనని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
కాగా, సోషల్ మీడియా యాక్టివిస్ట్ గౌతమ్ అరెస్ట్‌పై ఆదివారం సాయంత్రం ఒక వీడియో విడుదల అయింది. తనకు తెలుగు స్క్రైబ్‌కు తనకు ఎటువంటి సంబంధం లేదని, అది బీఆర్ఎస్ పార్టీ నడిపే సోషల్ మీడియా హ్యాండిల్ అని గౌతమ్ వీడియోలో స్పష్టం చేశారు. తనను రాయదుర్గం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారని, తనకు తెలుగు స్క్రైబ్ సోషల్ మీడియా హ్యాండిల్‌కు ఎటువంటి సంబంధం లేదని గౌతమ్ చెప్పుకొచ్చారు.






