- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీ ఫామ్‌హౌస్ సంగతి చెప్పు సారూ..? ఎన్ని ఎకరాలు ఎండిందో చూపియాలే! నెటిజన్ల పశ్న
ఎండిన పంటలు పరిశీలించడానికి రైతులకు భరోసా కల్పించడానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: ఎండిన పంటలు పరిశీలించడానికి రైతులకు భరోసా కల్పించడానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎండిన పంటలను పలు ప్రాంతాల్లో పరిశీలించారు. రైతలను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు కేసీఆర్ భరోసానిచ్చారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ నేతలు, నెటిజన్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
‘మీ ఫామ్ హౌస్‌లతో ఎన్ని ఎకరాలు ఎండిపోయిందో చూపెట్టండి సార్? ఆ తర్వాత బయటకు వచ్చి తిరిగితే బాగుంటది. మళ్ళీ ఆ పిట్టలదొర టోపీ ఒకటి’ అని ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. కాగా, కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వద్ద వ్యవసాయ క్షేత్రం ఉన్న విషయం తెలిసిందే. కేసీఆర్ అప్పుడప్పుడు తన పొలం పనులు కూడా చూసుకుంటారు.






