- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ నూతన విద్యా విధానానికి కసరత్తు వేగం.. డిజిటల్ బోధన, స్కిల్ డెవలప్‌మెంట్‌కి ప్రాధాన్యం
ప్రభుత్వ సలహాదారు కేశవరావు అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో ఏర్పాటైన తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పనకు మరింత సమయం పట్టనుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020ను అధ్యయనం చేసి తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా మార్పుచేసేలా ప్రభుత్వ సలహాదారు కేశవరావు అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో ఏర్పాటైన తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పనకు మరింత సమయం పట్టనుంది. ఈ కమిటీ తుది నివేదికను అక్టోబర్ 31 వరకు సమర్పించాల్సి ఉంది. కానీ కమిటీలోని సభ్యులు ఆయా అంశాలపై కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకోవడానికి విద్యా నిపుణులతో కూడిన 11 వర్కింగ్ కమిటీలను నియమించింది. ఈ కమిటీలు ఇచ్చే రిపోర్టుల ఆధారంగా సమగ్రమైన తెలంగాణ విద్యా విధానాన్ని రూపొందించనున్నారు. కమిటీలకు బాధ్యులుగా ఐఏఎస్ లు, వీసీలు, విద్యావేత్తలను నియమించారు. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ జాయ్ ఫుల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అంశంపై కన్వీనర్ గా ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిని నియమించారు. ఆయా అంశాలపై ఇప్పటికే నివేదిక సిద్ధం చేసిన ఆకునూరి మురిళి ఈ నెల 12 న తన రిపోర్టును కమిటీకి సమర్పించనున్నారు. ఎడ్యుకేషన్ టెక్నాలజీ అండ్ డిజిటల్ ఇన్నోవేషన్ అంశానికి కన్వీనర్ గా టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి వారం రోజుల్లోగా నివేదిక అందించడానికి సిద్ధంగా ఉన్నారు.
సమయం పట్టే అవకాశం:
కరికులమ్, పెడగోజి కల్చర్ అండ్ వాల్యూస్ ఎడ్యుకేషన్, గవర్నెన్స్, అకౌంటబిలిటీ అంశాలకు రిటైర్డ్ ఐఏఎస్ ఐవీ సుబ్బారావు, హయ్యర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ పై జేఎన్టీయూ వీసీ టీకేకే రెడ్డి, ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి, ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ లెర్నింగ్ పై రిటైర్డ్ ఐఏఎస్ రంజీవ్ ఆచార్య, ఈక్వాలిటీ, యాక్సెస్, స్టూడెంట్ సంక్షేమం పై ఓపెన్ వర్సిటీ వీసీ ఘంటా చక్రపాణిని కన్వీనర్లుగా నియమించారు. వీరందరు తమ నివేదికల రూపకల్పనకు సంబంధించి మరికొంత సమయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
జాబ్ మార్కెట్‌కు అనుగుణంగా :
రాష్ట్ర న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ముసాయిదా తయారీ కోసం కేశవరావు అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం సెప్టెంబర్ లో ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరిపింది. తెలంగాణ విద్యా విధానాన్ని జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) స్ఫూర్తితో, రాష్ట్ర ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా రూపొందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నూతన పాలసీ ప్రధానంగా జాబ్ మార్కెట్ కు అనుగుణంగా స్కిల్స్ పెంచడం కోసం ఎడ్యుకేషన్ ఫ్రేమ్ వర్క్ ను రూపొందించనుంది. ఇందులో డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్, ఇన్నోవేషన్, ఎంటర్ ప్రెన్యూయర్ షిప్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోనేందుకు పెద్ద పీట వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలు, టెక్నికల్, ఒకేషనల్, ప్రొఫెషనల్ కోర్సులను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం అనే అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనుంది. విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య పరిశోధన సహకారం ఏర్పాటుకు అవసరమైన సూచనలు, సలహాలు అందించేలా కమిటీ సభ్యులు కసరత్తు చేస్తున్నారు.






