ముగిసిన తొలి విడత పంచాయతీ పోలింగ్.. క్యూ లైన్‌లో ఉన్న వారికి ఓటేసే చాన్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-11 07:51:07  IST  )

రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సరిగ్గా ఒంటి గంటకు ముగిసింది.

ముగిసిన తొలి విడత పంచాయతీ పోలింగ్.. క్యూ లైన్‌లో ఉన్న వారికి ఓటేసే చాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సరిగ్గా ఒంటి గంటకు ముగిసింది. ఈ క్రమంలోనే నిర్ణీత సమయంలో పోలింగ్ కేంద్రాల ఎదుట క్యూ లైన్లలో ఉన్న ఓటర్లుకు ఎన్నికల అధికారులు ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. 3,834 సర్పంచ్ 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగగా.. 37,562 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై సాయంత్రానికి తుది ఫలితాలు వెలువడనున్నాయి. ఆ వెంటనే గెలుపొందిన సర్పంచ్, వార్డు మెంబర్లు ప్రత్యేకంగా సమావేశమై ఉప సర్పంచ్‌లను ఎన్నుకోనున్నారు.

Next Story