- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kurikyala: కురిక్యాల లైంగిక వేధింపుల ఘటనపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్
విద్యాసంస్థల్లో బాలిక భద్రత పట్ల నిర్లక్ష్యాన్ని ఏ రూపంలో సరించబోమని టీజీఎస్సీడబ్ల్యూ స్పష్టం చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఆఫీస్ సబార్డినేట్ ఎండి యాకుబ్ పాషా బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై తెలంగాణ మహిళా కమిషన్ (Telangana Women Commission) సీరియస్ అయింది. ఘటనపై సమగ్ర విచారణ చేసి నిందితులకు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, పోలీసులకు కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద (Neredla Sharada) ఆదేశించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన నేరెళ్ల శారద.. విద్యాసంస్థల్లో చదువుకునే బాలికల భద్రత, గౌరవం పట్ల నిర్లక్ష్యాన్ని ఏ రూపంలోనూ సహించబోమని స్పష్టం చేశారు. విద్యాసంస్థలు విద్యార్థినుల భవిష్యత్ నిర్మాణంలో కీలకమైనవని అవి స్వేచ్ఛాయుత, సురక్షిత, గౌరవప్రదమైన వాతావరణంలో ఉండాలన్నారు. భవిష్యత్‍లో ఇలాంటి ఘటనలు జరగకుండా నిరోధించేందుుక జిల్లా యంత్రాంగం కాలేజీలు, విద్యాసంస్థలు, హస్టళ్లలో తనిఖీలు చేపట్టి భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. అలాగే ఈ కేసు పురోగతిని మహిళా కమిషన్ పర్యవేక్షిస్తామని బాధిత విద్యార్థినులకు అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.






