- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Telangana Women Commission: త్రినాథ రావు వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్..
సినీనటి అన్షు (Anshu)పై దర్శకుడు త్రినాథ రావు నక్కిన (Trinatha Rao Nakkina) చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీ (Tollywood Industry)లో హాట్ టాపిక్‌గా మారాయి.

దిశ, వెబ్‌డెస్క్: సినీనటి అన్షు (Anshu)పై దర్శకుడు త్రినాథ రావు నక్కిన (Trinatha Rao Nakkina) చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీ (Tollywood Industry)లో హాట్ టాపిక్‌గా మారాయి. నటుడు సందీప్ కిషన్ (Sandeep Kishan) హీరోగా తాను డైరెక్ట్ చేసిన ‘మజాకా’ (Majaka) టీజర్‌ను అదివారం లాంచ్ చేశారు. ఈ సందర్భంగా వేదికపై త్రినాథ రావు (Trinadha Rao) మాట్లాడుతూ.. హీరోయిన్ అన్షుపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ‘తెలుగు సినిమాల్లో ఇలా సన్నగా ఉంటే కుదరదని.. బాగా తిని సైజులు పెంచాలి’ అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా (Social Media)లో ట్రెండ్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే త్రినాథ రావు (Trinatha Rao) అసభ్యకర వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ (Telangana Women Commisison) సీరియస్ అయింది. హీరోయిన్ అన్షు (Anshu)పై చేసిన వ్యాఖ్యలను తాము సుమోటో (Sumoto)గా స్వీకరించామని ప్రకటించింది. త్వరలో త్రినాథ రావు (Trinatha Rao)కు నోటీసులు జారీ చేస్తామని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద (Neralla Sarada) తెలిపారు.






