- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ Vs ఏపీ.. మరోసారి భగ్గుమన్న కృష్ణా జలాల వివాదం
by Sathputhe Rajesh |
ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి కృష్ణా జలాల వివాదం భగ్గుమంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి కృష్ణా జలాల వివాదం భగ్గుమంది. నాగార్జున సాగర్ టెయిల్ పాండ్‌లో నీటి నిల్వలు ఖాళీగా ఉండటం తీవ్ర కలకలం రేపింది. టెయిల్ పాండ్ లో నీటిని ఏపీ సర్కార్ ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు తీవ్ర తాగునీటి సమస్య ఏర్పడే ప్రమాదముంది. అయితే రెండు రోజుల క్రితం టెయిల్ పాండ్‌ను నీటి పారుదుల శాఖ కమిషనర్ సుల్తానియా సందర్శించారు. టెయిల్ పాండ్ లోని నీటిని ఏపీ తరలించడంపై అధికారుల ద్వారా సుల్తానియా వివరాలు సేకరించారు. ఏపీ నీటి వినియోగంపై ప్రభుత్వానికి అధికారులు నివేదిక సమర్పించారు. ఏపీ తీరుపై కేఆర్ఎంబీకి తెలంగాణ సర్కార్ లేఖ రాయనున్నట్లు తెలుస్తోంది.
Next Story






