ఢిల్లీకి బయల్దేరిన తెలంగాణ ట్రక్కు..

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-11 11:25:44  IST  )

ఢిల్లీకి బయల్దేరిన తెలంగాణ ట్రక్కు..

ఢిల్లీకి బయల్దేరిన తెలంగాణ ట్రక్కు..
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ఎన్నికల కమిషన్ ద్వారా ఓట్ల దొంగతనం చేస్తోందని.. ఈ విషయాన్ని బహిర్గతం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. దీనిపై దేశ వ్యాప్తంగా సంతకాల సేకరణ చేయాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా గురువారం సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. తెలంగాణలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో గ్రామ స్థాయిలో సంతకాల సేకరణ చేశారు. 10 లక్షల పై చిలుకు సంతకాల సేకరణ చేసి ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయానికి పంపించారు. దేశ వ్యాప్తంగా సేకరించిన సంతకాల సేకరణ పత్రాలని, 14వ తేదీన రాష్ట్రపతి ముర్ముకి అందజేసి ఎన్నికలు పారదర్శకంగా జరిగే విధంగా చూడాలని అభ్యర్థించనున్నారు. తెలంగాణలో సేకరించిన 10 లక్షల సంతకాల సేకరణ పత్రాలను ట్రక్కు ద్వారా ఢిల్లీకి పంపించారు.

Next Story