సరస్వతి అంత్య పుష్కరాలు.. ప్రత్యేక ప్యాకేజీ టూర్లు ప్రారంభించిన పర్యాటక శాఖ

by Naga Rani Yarlagadda |

పవిత్రమైన సరస్వతి అంత్య పుష్కరాలను దర్శించేందుకు కాళేశ్వరానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర పర్యాటక శాఖ హైదరాబాద్ నుండి ప్రత్యేక ప్యాకేజ్ టూర్లను ప్రకటించింది.

సరస్వతి అంత్య పుష్కరాలు.. ప్రత్యేక ప్యాకేజీ టూర్లు ప్రారంభించిన పర్యాటక శాఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: పవిత్రమైన సరస్వతి అంత్య పుష్కరాలను దర్శించేందుకు కాళేశ్వరానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర పర్యాటక శాఖ హైదరాబాద్ నుండి ప్రత్యేక ప్యాకేజ్ టూర్లను ప్రకటించింది. భక్తులకు ఆధ్యాత్మికంగా స్ఫూర్తిదాయకమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన యాత్ర అనుభవాన్ని అందించడమే ఈ ప్యాకేజీల ప్రధాన ఉద్దేశ్యం. తెలంగాణలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటైన కాళేశ్వరం లో సరస్వతి అంత్య పుష్కరాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రం నలుమూలలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆధునిక రవాణా సౌకర్యాలు, ఆలయ దర్శన సహాయం, పర్యాటక ప్రదేశాల సందర్శనతో కూడిన ప్రత్యేక పుణ్యయాత్ర ప్యాకేజీలను తెలంగాణ టూరిజం రూపొందించింది. ఈ ప్యాకేజీలో కాళేశ్వరంలో పవిత్ర పుష్కరిణి స్నానం, శ్రీ ముక్తేశ్వర స్వామి దేవాలయం దర్శనం, అలాగే యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం సందర్శనను పొందుపరిచారు. పూర్తి వివరాలకు 91 98481 25720, 91 83672 85285 అధికారిక వెబ్‌సైట్ tourism.telangana.gov.in ను సంప్రదించవచ్చు.

ప్రత్యేక ప్యాకేజ్ వివరాలు

ఏసీ హైటెక్ స్లీపర్ కోచ్ ప్యాకేజ్ (30 సీటర్లు)

పెద్దలకు చార్జీ: రూ. 3,600/-

పిల్లలకు చార్జీ: రూ. 2,880/-

ఏసీ మినీ కోచ్ ప్యాకేజ్ (21 సీటర్లు)

పెద్దలకు చార్జీ: రూ. 2,800/-

పిల్లలకు చార్జీ: రూ. 2,240/-

Next Story