సిజేరియన్ ప్రసవాల్లో అగ్రస్థానంలో తెలంగాణ

by Ajay Maddhiboyina |

నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. సిజేరియన్ ప్రసవాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. దేశ సగటు 22.9 శాతం కంటే దాదాపు మూడు రెట్లు అధికంగా తెలంగాణలో సిజేరియన్ ప్రసవాలు జరుగుతున్నట్టు తేలింది.

సిజేరియన్ ప్రసవాల్లో అగ్రస్థానంలో తెలంగాణ
X

దిశ, వెబ్ డెస్క్: నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. సిజేరియన్ ప్రసవాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. దేశ సగటు 22.9 శాతం కంటే దాదాపు మూడు రెట్లు అధికంగా తెలంగాణలో సిజేరియన్ ప్రసవాలు జరుగుతున్నట్టు తేలింది. ప్రస్తుతం రాష్ట్రంలో 62.2 శాతం సిజేరియన్ కాన్పులే జరుగుతున్నట్టు సర్వేలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో 48.6 శాతం, ఏపీలో 52.2 శాతం సిజేరియన్లు జరుగుతున్నట్టు తెలిసింది. మరోవైపు షుగర్‌లోనూ జాతీయ సగటును తెలంగాణ దాటేసింది. రాష్ట్రంలో28.2 శాతం, మహిళల్లో 24.2 శాతం మంది షుగర్ తో బాధపడుతున్నట్టు తెలిసింది. అయితే రాష్ట్రంలో సిజేరియన్ లు పెరిగినప్పటికీ మాతృ మరణాల రేటు భారీగా తగ్గినట్టు నివేదికలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతి లక్ష జననాలకు 88మంది మరణిస్తుండగా తెలంగాణ పరిస్థితి చాలా మెరుగైన స్థితిలో ఉంది. దేశంలోనే అత్యల్ప మాతృ మ‌ర‌ణాలు న‌మోద‌వుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉంది. మ‌రోవైపు శిశు మ‌ర‌ణాల రేటు కూడా తెలంగాణ‌లో అత్య‌ల్పంగానే న‌మోదవుతోంది.

Next Story