cotton:పత్తి కొనుగోళ్లలో దేశంలోనే తెలంగాణ నెం.1

by Prasad Jukanti |   (  Updated:2025-04-08 11:29:36  IST  )

ఎమ్మెస్పీ పత్తి కొనుగోళ్లలో దేశంలోనే తెలంగాణ నెం.1 గా నిలిచిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

cotton:పత్తి కొనుగోళ్లలో దేశంలోనే తెలంగాణ నెం.1
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ ఏడాది పత్తి కొనుగోళ్లలో (Cotton Procures) దేశంలోనే తెలంగాణ (Telangana) నెం.1 స్థానంలో నిలిచిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుత పత్తి సీజన్ (2024-25)కు సంబంధించి మార్చి 31 2025 వరకు జరిగిన కొనుగోళ్లలో తెలంగాణ అత్యధికంగా 40 లక్షల బేళ్ల సేకరణను నమోదు చేసిందని మంగళవారం టెక్స్‌టైల్స్‌ శాఖ తెలిపింది. ఆ తర్వాత 30 లక్షల బేళ్లతో మహారాష్ట్ర, 14 లక్షల బేళ్లతో గుజరాత్ ఉన్నాయని తెలిపింది. గణనీయమైన సేకరణ సాధించిన ఇతర రాష్ట్రాల్లో కర్ణాటక (5 లక్షల బేళ్లు), మధ్యప్రదేశ్ (4 లక్షల బేళ్లు), ఆంధ్రప్రదేశ్ (4 లక్షల బేళ్లు), ఒడిశా (2 లక్షల బేళ్లు). హర్యానా, రాజస్థాన్ మరియు పంజాబ్‌లలో 1.15 లక్షల బేళ్ల సేకరణ జరిగినట్లు తెలిపింది. మొత్తం పత్తి ఉత్పత్తి చేసే అన్ని రాష్ట్రాలలో సుమారు 21 లక్షల మంది పత్తి రైతులకు రూ.37,450 కోట్లు చెల్లించినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సీసీఐ ద్వారా దేశవ్యాప్తంగా 508 పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఎంఎస్పీ (MSP) కింద 100 లక్షల బేళ్లకు సమానమైన 525 లక్షల క్వింటాళ్ల విత్తన పత్తిని విజయవంతంగా సేకరించినట్లు పేర్కొంది.

Next Story