- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Telangana Thalli: కేసీఆర్‌ను కలిసిన అనంతరం మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
తెలంగాణ తల్లి(Telangana Thalli) విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్(KCR)ను ఆహ్వానించామని(Invitation) బీసీ, రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ తల్లి(Telangana Thalli) విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్(KCR)ను ఆహ్వానించామని(Invitation) బీసీ, రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. కేసీఆర్ కు ఆహ్వానం అందించేందుకు ఎర్రవల్లి ఫామ్ హౌజ్(Erravalli Form House) వెళ్లి, ఆయనకు విగ్రహావిష్కరణ ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 9న డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం(Telangana Secretariet)లో జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ప్రోటోకాల్ ప్రకారం ఉదయం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnudev Varma), కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Unioin Minister Kishan Reddy)లను ఆహ్వానించామని తెలిపారు.
ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు(Opposition Leader)గా ఉన్న కేసీఆర్‌ను కూడా ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్(Harkara Venugopal) తో పాటు డైరెక్టర్ వెంకట్రావ్ లతో కలిసి ఆహ్వానం అందింజేశామని, ఈ సందర్భంగా కేసీఆర్ ను తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాలని కోరడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పక్షాన అందరినీ మర్యాదగా గౌరవించుకుంటామని, తెలంగాణ అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేయడమే లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పారు. అలాగే కేసీఆర్‌తో ఎలాంటి రాజకీయ అంశాలపై మాట్లాడలేదని, ఆయన అసెంబ్లీకి వస్తారా? రారా? అనేది వారి వ్యక్తిగత విషయం అని, అటువంటి చర్చలేమి జరగలేదని అన్నారు. అంతేగాక విగ్రహ ఏర్పాటును వ్యతిరేకించడంపై ప్రతిపక్ష నాయకులుగా వారి విధానాలు వారికి ఉంటాయని, ఇప్పుడు జరిగింది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.






