- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG-TET Notification : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) నిరుద్యోగులకు మరో కీలక ప్రకటన విడుదల చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) నిరుద్యోగులకు మరో కీలక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ టెట్(Telangana TET) నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 15 నుంచి జూన్ 30 మధ్య టెట్ పరీక్షలు నిర్వహించున్నట్టు పాఠశాల విద్యశాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. కాగా బీసీ రిజర్వేషన్ల బిల్లు సంగతి తేలాక.. రాష్ట్రంలో భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు నిర్వహించే టెట్ పరీక్షను నిర్వహించేందుకు సిద్ధం అయింది. అయితే ఏడాదికి రెండుసార్లు టెట్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటోంది.
కాగా ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఏప్రిల్ 15 నుంచి అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతామని అధికారులు పేర్కొన్నారు. ఏప్రిల్ 15 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించనుండగా.. జూన్ 15 నుంచి ౩౦ వరకు పరీక్షలు నిర్వహించి జూలై 22న ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇక ఒక పేపర్ మాత్రమే రాసే వారికి రూ. ౭౫౦, రెండు పేపర్లు రాసేవారికి రూ.1000 గా ఫీజు నిర్ణయించారు.






