కేరళ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ టీమ్.. ఏఐసీసీ నిర్ణయం

by Ramesh Naini |

ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు ఎన్నికల ప్రచారానికి నేతలను ఏఐసీసీ ఎంపిక చేసింది.

కేరళ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ టీమ్.. ఏఐసీసీ నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు ఎన్నికల ప్రచారానికి నేతలను ఏఐసీసీ ఎంపిక చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ నుంచి నలుగురు నాయకులను ఏఐసీసీ ఎంపిక చేసింది. వారిలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, శాసన మండలి విప్ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలను ఏఐసీసీ కేరళ ఎన్నికల ప్రచారానికి నియమించింది. మంత్రి శ్రీధర్ బాబుని రెండు జిల్లాల ఇంచార్జ్‌గా నియమించగా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ త్రివేండ్రంలోని కేరళ పీసీసీ కార్యాలయంలో వీరితో సమావేశం అయ్యారు. ఏప్రిల్ 7వ తేదీ వరకు వారికి కేటాయించిన ప్రాంతాల్లో వీరు ఎన్నికల కార్యక్రమాలు చేయాల్సి ఉంటుందని కాంగ్రెస్ వారికి ఆదేశాలు జారీ చేసింది.

Next Story